Monday, December 23, 2024

యుపిఎస్‌సి, 2024 నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

మే 26న ప్రిలిమ్స్, సెప్టెంబర్ 20 నుంచి మెయిన్స్

న్యూఢిల్లీ: నివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సిఎస్‌ఇ), 2024కు సంబంధించిన నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు యుపిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. యుపిఎస్‌సి సిఎస్‌సి ప్రిలిమ్స్ ఈ ఏడాది మే 26న, మెయిన్ ఎగ్జామ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుంచి ఐదురోజుల పాటు జరుగుగుతాయి. సిఎస్‌ఇలో 1,056 ఖాళీలు, ఐఎఫ్‌ఎస్‌లో 150 ఖాళీలను యుపిఎస్‌సి ప్రకటించింది.

గత ఏడాదితో పోలిస్తే ఖాళీల సంఖ్య తగ్గింది. గత ఏడాది సివిల్ సర్వీసుల ఎగ్జామ్ కోసం 1105 ఖాళీలను యుపిఎస్‌సి ప్రకటించింది. గత ఏడాది మే 28న ప్రిలిమ్స్, సెప్టెంబర్ 15 నుంచి మెయిన్స్‌ను యుపిఎస్‌సి ప్రకటించింది. కాగా.. ఇప్పుడు దరఖాస్తు ఫారాలను విడుదల చేయడంతో ఎలిజిబిలిటీ క్రైటీరియాను ఇంకా ప్రకటించవలసి ఉంది. దరఖాస్తును నింపడానికి ముందుగానే అభ్యర్థులు ఎలిజిబిలిటీ క్రైటీరియాను తెలుసుకోవలసి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ అనే మూదు దశలలో జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News