Thursday, November 21, 2024

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు వెల్లడి

- Advertisement -
- Advertisement -

UPSC Civil Services Mains Result 2020

హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష ఫలితాలను గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను యుపిఎస్‌సి వెల్లడించింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి ఢిల్లీలోని యుపిఎస్‌సి కార్యాలయంలో ప్రారంభమయ్యే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ తదితర అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది ఎంపికైనట్లు శిక్షణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మెయిన్స్‌లో అర్హత పొందని వారి మార్కులను ఇంటర్వ్యూలు పూర్తయిన 15 రోజుల్లోగా యుపిఎస్‌సి వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News