Saturday, July 6, 2024

సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

UPSC Civil Services prelims result 2021 released

హైదరాబాద్ : యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 10వ తేదీన పరీక్ష జరుగగా, సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం యుపిఎస్‌సి విడుదల చేసింది. అలాగే మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ షీట్లను upsc.gov.in వెబ్‌సైటులో అందుబాటులో ఉంచారు. సివిల్స్ ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం డీటేయిల్డ్ అప్లికేషన్ ఫాం 1(డిఎఎఫ్ 1)ని మరోసా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు తేదీలను తర్వాత వెల్లడిస్తామని యుపిఎస్‌సి తెలిపింది. సివిల్స్ ప్రిమిలినరీ పరీక్షలు సంబంధించి ఏమైనా సందేహాలుంటే అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011- 23385271, 011 -23098543, 011 -23381125 నెంబర్లకు ఫోన్ చేయాలని యుపిఎస్‌సి సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News