Saturday, November 23, 2024

టాప్-3 ‘ముగ్గురూ మహిళలే’

- Advertisement -
- Advertisement -

మొదటి ర్యాంకు శృతిశర్మ (ఢిల్లీ), రెండో ర్యాంకు
అంకిత అగర్వాల్ (ఢిల్లీ వర్శిటీ), మూడో ర్యాంకు గామిని సింగ్లా (చండీగఢ్)

తొలి 25మంది టాపర్లలో
15మంది పురుషులు, 10మంది మహిళలు

ఉత్తీర్ణులు 658 మంది,
పురుషులు 508, స్త్రీలు 177మంది

టాప్3 స్థానాలు వారివే
శృతిశర్మకు నంబర్ వన్ ర్యాంక్
అంకితా అగర్వాల్, గామిని సింగ్లాకు రెండు, మూడు స్థానాలు
టాప్ 25లో పదిమంది వారే
ఉత్తీర్ణులైన మొత్తం 658 మంది

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( యుపిఎస్‌సి) సోమవారం విడుదల చేసిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో మహిళలు సత్తా చాటారు. తొలి మూడు స్థానాలను వారే దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన శృతి శర్మ నంబర్ వన్ ర్యాంక్ సాధించగా అంకితా అగర్వాల్, గామిని సింగ్లా రెండు మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఐశ్వర్యా వర్మ నాలుగో స్థానంలో నిలిచారు. మొత్తం 658 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు ఉన్నారు. టాపర్‌గా నిలిచిన శృతిశర్మ ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ(ఆనర్స్)లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత జెఎన్‌టియులో పిజి చేశారు.

గత నాలుగేళ్లుగా సివిల్ సర్వీస్‌పరీక్షకోసం సన్నద్ధమవుతున్న ఆమె జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీకే చెందిన అంకితా అగర్వాల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆమె ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. చండీగఢ్‌కు చెందిన గామిని సింగ్లా కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పూర్తి చేసి సోషియాలజీ అప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకుని సివిల్ సర్వీస్‌లో సత్తా చాటారు . తొలి 25 మంది టాప్‌ర్యాంకర్లలో 15 మంది పురుషులు కాగా, 10 మంది మహిళలున్నారు. సివిల్ సర్వీస్ పరీక్ష్ల విజేతలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. విజేతల్లో 244 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు కాగా,73 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారున్నారు. ఒబిసిలు 205 మంది, ఎస్‌సిలు 105 మంది, ఎస్‌టిలు 60 మంది ఉన్నారు.

తల్లిదండ్రులు, స్నేహితులు ప్రోత్సహించారు

కాగా సివిల్స్ 2021ఫలితాల్లో టాప్ ర్యాంక్ సాధించడం పట్ల శృతిశర్మ హర్షం వ్యక్తం చేశారు. సివిల్స్‌కు అర్హత సాధిస్తాన్న విశ్వాసం ఉండింది కానీ టాప్‌ర్యాంక్ రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఎంతో కష్టంతో కూడుకున్న ఈ ప్రయాణంలో ఎంతో మంది ముఖ్యంగా తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతో ప్రోత్సాహం అందించారన్నారు.‘ నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, స్నేహితులు పూర్తిగా సహకరించారు. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు’ అని ఆమె అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజినుంచి డిగ్రీ పూర్తి చేసిన ఆమె జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీనుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. గత నాలగేళ్లుగా సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అవుతున్న శృతిశర్మ జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. యుజిసి నిధులతో నడుస్తున్న ఈ అకాడమీలో ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ సారి సివిల్ సర్వీస్ పరీక్షల్లో తమ అకాడమీలో శిక్షణ పోందిన 23 మంది ఉత్తీర్ణులయినట్లు అకాడమీ అధికారి ఒకరు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News