Thursday, January 23, 2025

సివిల్స్ ర్యాంకులపై తప్పుడు పత్రాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సివిల్స్ పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు సాధించామని తెలియచేసుకున్న ఇద్దరిపై యుపిఎస్‌సి క్రిమినల్, క్రమ శిక్షణ చర్యలకు సిద్ధమైంది. మంగళవారం ఫలితాలు వె లువడ్డాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన అయే షా మక్రానీ, బీ హార్‌కు చెందిన తుషార్‌లపై యుపిఎస్‌సి చర్యలకు సిద్ధం అవుతోంది. సివిల్స్‌లో తాము అర్హత సాధించామని ఇద్దరూ ఒకే రోల్‌నెంబరుతో ముందుకు రావడం వివాదాస్పదమ యింది.

అయితే యుపిఎస్‌సి వెలువరించిన ఫలితాలలో వీరి పేర్ల ప్రస్తావనలేదు. వీరు పేర్కొన్న రోల్‌నెంబర్లపై వేరేవారు ఎంపిక అయి ఉండటంతో వెంటనే దీనిని పరిశీలించిన కమిషన్ బీహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన వీరు నకిలీలని తేల్చారు. తమకు ఫలానా ర్యాంకు వచ్చిందని తెలియచేసుకునే క్రమంలో తప్పుడు పత్రాలను సృష్టించారని అయితే వీరు వేర్వేరుగా ఒకే ర్యాంకుపై తమ వాదన విన్పించిన క్ర మంలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. యుపిఎస్‌సి పటిష్ట పరీక్షా విధానం, ఫలితాల వెల్లడిలో తప్పిదాలకు వీ లుండదని, అక్రమాలతో ర్యాంకుల అర్హతకు వచ్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News