Wednesday, January 22, 2025

ఫోర్జరీ చేసినందుకు పూజా ఖేద్కర్ పై ఎఫ్ఐఆర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుక్రవారం ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌పై అనేక చర్యలను చేపట్టింది, నకిలీ గుర్తింపు ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి ప్రయత్నించినందుకు ఆమెపై పోలీసు కేసు నమోదు నమోదయింది కూడా.

సివిల్ సర్వీసెస్ పరీక్ష-2022 తాలూకు ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం, భవిష్యత్ పరీక్షలు/సెలక్షన్ల నుండి డిబార్ చేయడానికి సంబంధించి కమిషన్ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

2023 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన ఖేద్కర్ ఇటీవల పూణేలో శిక్షణ సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.

” సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022కు తాత్కాలికంగా సిఫార్సు చేయబడిన అభ్యర్థి శ్రీమతి పూజ మనోరమ దిలీప్ ఖేద్కర్ యొక్క దుష్ప్రవర్తనపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివరణాత్మక, సమగ్ర దర్యాప్తును నిర్వహించింది” అని కమిషన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఖేద్కర్ తన పేరు, ఆమె తండ్రి ,తల్లి పేరు, ఆమె ఫోటో/సంతకం, ఆమె ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ , ఆమె చిరునామా  మార్చడం ద్వారా పరీక్ష నిబంధనల ప్రకారం అనుమతించదగిన పరిమితికి మించి మోసపూరితంగా యత్నించినట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News