Sunday, September 8, 2024

ట్రైనీ ఐఎఎస్ పూజా ఖేద్కర్‌పై ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) అర్హత సాధించేందుకు తప్పుడు పద్ధతులు అనుసరించినందుకు ఐఎఎస్ ప్రొబేషనర్ పూజా ఖేద్కర్‌పై శుక్రవారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన యుపిఎస్‌సి ఆమె ఉద్వాసనకు ప్రక్రియ ప్రారంభించింది. 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షకు తాత్కాలికంగా సిఫార్సు అయిన అభ్యర్థి పూజా ఖేద్కర్ తప్పుడు పద్ధతిపై తాము వివరణాత్మక, కూలంకషమైన దర్యాప్తు నిర్వహించామని యుపిఎస్‌సి ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘తన పేరు, తన తల్లిడంద్రుల పేర్లు, తన ఫోటోగ్రాఫ్/ సంతకం, తన ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్,

చిరునామా మార్పు ద్వారా తన గుర్తింపు వంచనతో పరీక్ష నిబంధనల కింద అనుమతి పరిమితికి మించి ఆమె తప్పుడు పద్ధతులు అనుసరించిందని ఈ దర్యాప్తులో వెల్లడైంది’ అని ఆ ప్రకటన తెలిపింది. పోలీస్ అధికారుల వద్ద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం ద్వారా క్రిమినల్ ప్రాసిక్యూషన్ సహా ఆమె వరుస చర్యలను యుపిఎస్‌సి ప్రారంభించిందని, సివిల్ సర్వీసెస్ పరీక్ష 2022 నిబంధనావళి ప్రకారం, సివిల్ సర్వీసెస్ పరీక్ష 2022కు ఆమె అభ్యర్థిత్వం రద్దు, భవిష్యత్ పరీక్షలు/ ఎంపికల నుంచి బహిష్కరణ కోసం యుపిఎస్‌సి సంజాయిషీ నోటీస్ జారీ చేసిందని ఆ ప్రకటన తెలియజేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News