Saturday, December 28, 2024

యుపిఎస్‌సి సివిల్స్ ప్రిలిమ్స్ -ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

యుపిఎస్‌సి సివిల్స్ ప్రిలిమ్స్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం సాయంత్రం సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని యుపిఎస్‌సి తెలిపింది. ఈ ఏడాది జూన్ 16న యుపిఎస్‌సి సివిల్స్ ప్రిలిమ్స్ 2024 పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. జనరల్ స్టడీస్ పేపర్-1, పేపర్-2లకు కలిపి మొత్తం 200 మార్కులకు పరీక్ష జరిగింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం సివిల్స్ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి జరగాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News