Saturday, November 23, 2024

సివిల్స్‌లో తెలుగు వెలుగులు

- Advertisement -
- Advertisement -

UPSC release final results of Civils-2020

శుభం కుమార్, సివిల్స్2020 ఫస్ట్ ర్యాంకు

టాప్ 100 ర్యాంకుల్లో నలుగురు
సివిల్స్ సర్వీసెస్ 2020 ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ,
ఎపిల అభ్యర్థులు, పి.శ్రీజకు 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు
27, రవికుమార్ 84, యశ్వంత్ కుమార్ రెడ్డి 93వ ర్యాంకు

మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన సివిల్స్ -2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 ఒబిసి, 122 ఎస్‌సి, 61 ఎస్‌టి, 86 మంది ఇడబ్య్లూఎస్ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్- 2020 తుది ఫలితాల్లో ఐఐటి బాంబే నుంచి బి.టెక్(సివిల్ ఇంజనీరింగ్) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు రాగా, భోపాల్ నిట్ నుంచి బి.టెక్(ఎలక్రికల్ ఇంజనీరింగ్) చేసిన జాగృతి అవస్తికి రెండో ర్యాంకు, అంకితా జైన్ మూడవ సాధించారు. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలవడం విశేషం. ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఎఎస్, ఐపిఎస్,ఐఎఫ్‌ఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం తుది ఫలితాలను యుపిఎస్‌సి విడుదల చేసింది.

మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యుపిఎస్‌సి విడుదల చేసింది. 2015లో యుపిఎస్‌సి సివిల్స్ టాపర్‌గా నిలిచిన టీనా దాబి సోదరి రి యా దాబి 15వ ర్యాంకు సాధించారు. ఈ ఫలితాల్లో తొలి 25 మంది జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా, 12 మంది అమ్మాయిలు మెరిశారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్ ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. రెండో ర్యాంకు సాధించిన జాగృతి అవస్తీ భోపాల్‌లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ పూర్తి చేశారు.

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

సివిల్ సర్వీసెస్ పరీక్ష 2020 ఫలితాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100 లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థులు పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్ 84వ ర్యాంకు, యశ్వంత్ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు, కె.సౌమిత్ రాజు 355వ ర్యాంకు, తిరుపతి రావు 441, ప్రశాంత్ సూరపాటి 498, ఎడుగుల వేగిని 986వ ర్యాంకు, డి.విజయ్ బాబు 682వ ర్యాంకు, కళ్లం శ్రీకాంత్‌రెడ్డి 747వ ర్యాంకు సాధించారు.

తెలుగు టాపర్లు…

పి. శ్రీజకు 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు, జగత్ సాయికి 32వ ర్యాంకు, దేవగుడి మౌనికకు (కడప) 75వ ర్యాంకు, రవి కుమార్‌కు 84వ ర్యాంకు, యశ్వంత్ కుమార్ రెడ్డికి 93వ ర్యాంకు.
ప్రజలకు సేవ చేయడమే లక్షం

వి.సంజన సింహా, 207వ ర్యాంకు

ప్రజలకు సేవ చేయాలనే లక్షంతోనే సివిల్స్ రాశానని సివిల్స్ ఫలితాల్లో 207 ర్యాంకు సాధించిన వి.సంజన సింహా అన్నారు. మా నాన్న లాయర్ కావడం వల్ల చిన్నప్పటి నుంచే చాలా విషయాలపై అవగాహన పెంపొందించారని తెలిపారు. మా తల్లిదండ్రులు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిండచం వల్లనే సివిల్స్‌లో ర్యాంకు సాధించగలిగానని పేర్కొన్నారు. మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించానని అన్నారు.

మెరిసిన ఓరుగల్లు ముద్దుబిడ్డ..

సివిల్స్ ఫలితాలలో ఓరుగల్లు అమ్మాయి అడెపు వర్షిత 413 సిసాధించారు. మూడో ప్రయత్నంలో యుపిఎస్‌సికి ఎంపికైన వర్షితకు ఐపిఎస్ వచ్చే అవకాశం ఉంది. ఓ చిరు వ్యాపారి ఆడెపు రాధారాణి, ఆడెపు కట్టమల్లు దంపతుల కూతురు వర్షిత. హన్మకొండ బస్టాండ్ వెనకాల ఓ చిన్న ఇల్లు. అమ్మానాన్నలకు ఇద్దరూ ఆడపిల్లలే. అందులో వర్షితే చిన్నమ్మాయి. ఇద్దరు ఆడపిల్లలు అయినా ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ కృంగిపోలేదు. కొడుకులు లేరన్న భావనే వారి మనస్సులోకి రానివ్వలేదు. కూతుళ్లిద్దరిని కొడుకుల మాదిరిగా పెంచారు..అలాగే చదివించారు. పెళ్లిళ్లు చేసి సాగనంపాల్సిన ఆడపిల్లలకు తమ తాహతకు మించి చదివించడం అవసరమా..? అని బంధువులు, ఇరుగుపొరుగు వారు ఎగతాళి చేసినా.. ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదు. తాము కన్న కల లు నెరవేర్చుకునేందుకు ఆడపిల్లలైనా కష్టపడి చదివించారు. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయకుండా కష్టపడి చదివారు. అనుకున్నట్టుగానే పెద్దమ్మాయి డాక్టర్‌గా ఢిల్లీలో స్థిరపడ్డారు. ఇప్పుడు రెండో అమ్మాయి ఆడెపు వర్షిత సివిల్స్‌లో ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News