- Advertisement -
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2023 ఫలితాలను సోమవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో విజేతలైన అభ్యర్థుల రోల్ నంబర్లతోపాటు వారి సేర్ల జాబితాను కూడా యుపిఎస్‌సి విడుదల చేసింది.
యుపిఎస్‌సి ప్రిలిమ్స్ పరీక్షలో కట్ ఆఫ్ సాధించిన అభ్యర్థులు తమ పేర్లను యుపిఎస్‌సి వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్షను ఏటా మూడు దశల్లో యుపిఎస్‌సి నిర్వహిస్తుంది.ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వూ వంటి మూడు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్, తదితర ప్రభుత్వ అత్యున్నత పదవులను సాధించవచ్చు. ప్రిలిమ్స్‌లో నెగ్గిన విద్యార్థులు సెప్టెంబర్‌లో జరిగే మెయిన్స్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావలసి ఉంటుంది.
- Advertisement -