Saturday, December 21, 2024

యుపిఎస్‌సి మార్కుల జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -
టాపర్ ఆదిత్యకు 54.2 శాతం
అనిమేష్ ప్రధాన్‌కు 52.69 శాతం
దోనూరు అనన్య రెడ్డికి 52.59 శాతం

న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్ ఆదిత్య శ్రీవాత్సవ 54.27 శాతం సాధించినట్లు కమిషన్ శుక్రవారం విడుదల చేసిన అభ్యర్థుల మార్కుల జాబితా ప్రకారం తెలుస్తున్నది. రెండవ స్థానంలో ఉన్న అనిమేష్ ప్రధాన్ 2023 సివిల్ సర్వీసెస్ పరీక్ష (సిఎస్‌ఇ)లో 52.69 శాతం సాధించారు. సిఎస్‌ఇలో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు వెరసి 1016 మంది అర్హత సాధించారు. సిఎస్‌ఇ ఫలితాలను మంగళవారం ప్రకటించారు.

యుపిఎస్‌సి ఏటా సిఎస్‌ఇని మూడు దశలుగా ప్రాథమిక, మెయిన్, వ్యక్తిత్వ పరీక్ష (ఇంటర్వూ) నిర్వహిస్తుంటుంది. మొత్తం 2025 మార్కులలో నుంచి మెరిట్‌ను నిర్ధారిస్తార. లిఖిత లేదా మెయిన్ పరీక్షకు1750 మార్కులు, ఇంటర్వ్యూకు 275 మార్కులు ఉంటాయి. లక్నో (యుపి)కి చెందిన 27 ఏళ్ల ఆదిత్యకు మొత్తం 1099 మార్కులు వచ్చాయి. లిఖిత పరీక్షలో 899, వ్యక్తిత్వ పరీక్షలో 200 మార్కులు లభించాయి. ఒడిశా అంగుల్ జిల్లాలోని తాల్చేర్ పట్టణానికి చెందిన అనిమేష్ ప్రధాన్ లిఖిత పరీక్షలో 892, ఇంటర్వ్యూలో 175 మార్కులు వెరసి 1067 మార్కులతో రెండవ ర్యాంక్ సాధించారు.

ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యర్థిగా పరీక్షకు హాజరైన మూడవ ర్యాంకు విజేత దోనూరు అనన్య రెడ్డికి 1065 మార్కులు (52.59 శాతం) లభించాయి. తెలంగాణ మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యకు మెయిన్‌లో 875, ఇంటర్వూలో 190 మార్కులు వచ్చాయి. నాలుగవ ర్యాంకు విజేత పికె సిద్ధార్థ్ రామ్‌కుమార్‌కు లిఖిత పరీక్షలో 874, ఇంటర్వూలో 185 వెరసి 1059 మార్కులు (52.29 శాతం) లభించాయి. రుహాని 1049 మార్కులు (51.8 శాతం)తో ఐదవ ర్యాంకు పొందింది. ఆమెకు లిఖిత పరీక్షలో 856, ఇంటర్వూలో 193 మార్కులు వచ్చాయి. ఇది ఇలా ఉండగా, 240 మంది అభ్యర్థులను రిజర్వ్‌డ్ జాబితాలో ఉంచినట్లు యుపిఎస్‌సి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News