Thursday, January 23, 2025

తుంగతుర్తి ఎంఎల్‌ఎ గాదరి కిషోర్‌కు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

కౌంటర్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : తుంగతుర్తి ఎంఎల్‌ఎ గాదరి కిషోర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. గాదరి కిషోర్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను  హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. తుంగతుర్తి ఎంఎల్‌ఎ గాదరి కిషోర్ ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని గాదరి కిషోర్ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తుంగతుర్తి ఎంఎల్‌ఎ గాదరి కిషోర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఎన్నికల ఫలితాలు, కౌంటింగ్ వీడియో పుటేజీని ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News