ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 అధికారిక భాగస్వామిగా డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్‌ను నియమించినట్టు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వెల్లడించింది. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్‌ను ఐపిఎల్ అఫీషియల్ పార్ట్‌నర్‌గా ఎంపికచేయడం ఆనందంగా ఉందని బిసిసిఐ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఆదరణ కలిగిన లీగ్‌గా కొనసాగుతున్న ఐపిఎల్‌లో అప్‌స్టాక్స్ వంటి ప్రముఖ సంస్థ భాగస్వామిగా రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అప్‌స్టాక్స్ ఒప్పందం సరికొత్త ప్రయాణానికి నాంది పలికిందని బిసిసిఐ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఐపిఎల్ వంటి జనాదరణ కలిగిన క్రికెట్ లీగ్‌లో భాగస్వామ్యం లభించడంపై అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ రవి కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.