Monday, December 23, 2024

నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే ఉద్యమిస్తాం

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపడితే ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతామని డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.శివ వర్మ హెచ్చరించారు. భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీల సమావేశాన్ని ఆదివారం అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూర్ మండల కేంద్రంలోని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వర్ధం సైదులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.శివ వర్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న నల్లమల అడవులు పర్యాకట ప్రాంతమని ప్రతి ఏటా లక్షలాది మంది సందర్శించే ఉమామహేశ్వరం, శ్రీశైలం, మల్లేల తీర్థం వంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, ఇలాంటి పర్యాటక ప్రాంతాన్ని లెక్క చేయకుండా నల్లమల అడవులలో ఖనిజ సంపదను బడా సంస్థలైన పెట్టుబడిదారులకు అప్పజెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు అన్నారు.

యురేనియం తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు అడుగుతే ఇవ్వడం లేదని మాట్లాడిన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే కేంద్ర ప్రభుత్వమే స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపడితే దాదాపు మూడు రాష్ట్రాలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపడితే ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో గ్రామగ్రామాన ప్రజలకు యురేనియం వల్ల జరిగే నష్టాలను వివరించి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వర్థన్ సైదులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్, జిల్లా కార్యదర్శి తారాసింగ్, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు సుల్తాన్, రమేష్, మహేష్, సాయి ప్రకాష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News