- Advertisement -
సిటిబ్యూరోః తమను ఉద్యోగంలో నుంచి అన్యాయంగా తీసివేశారని అర్బన్ బ్యూటీ కంపెనీ ఉద్యోగులు ప్రగతి భవన్ ముట్టడికి శుక్రవారం వచ్చారు. అర్బన్ బ్యూటీ సర్వీసెస్ కంపెనీలో మోసాలు జరుగుతున్నాయని తాము ఫిర్యాదు చేశామని తెలిపారు. అప్పటి నుంచి కంపెనీ తమపై కక్ష కట్టి ఉద్యోగంలో నుంచి తీసివేశారని మహిళలు ఆరోపించారు. అధికారులు కలుగ జేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన మహిళా ఉద్యోగులకు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించారు.
- Advertisement -