నల్గొండ మున్సిపాల్టీతో పాటు 42 గ్రామాలను కలుపుతూ నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థ
మహబూబ్ నగర్, జడ్చర్ల,
భూత్పూర్ మున్సిపాల్టీలతో
పాటు 142 గ్రామాలతో
మహబూబ్‌నగర్ అర్భన్
డెవలప్‌మెంట్ అథారిటీల
ఏర్పాటు ఉత్తర్వులు జారీ
చేసిన ప్రభుత్వం సిఎం
కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లకు
కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
శ్రీనివాస్‌గౌడ్, ఎంఎల్‌ఎలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు పట్టణాభివృద్ధి సంస్థలుగా ఏర్పాటయ్యాయి. నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థ, మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ మున్సిపాల్టీతో పాటు 42 గ్రామాలను కలుపుతూ నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. నల్గొండ మండలానికి చెందిన 22, తిప్పర్తి మండలానికి చెందిన 9, కనగల్ మండలానికి చెందిన 6 గ్రామాలను ఇందులో చేర్చారు. నార్కట్‌పల్లి, నకిరేకల్ మండలాలకు చెందిన 2 చొప్పున గ్రామాలు, కట్టంగూర్ మండలానికి చెందిన ఒక గ్రామాన్ని నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థలో కలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, నల్గొండ మున్సిపల్ కమిషనర్ వైస్ చైర్మన్‌గా దీనికి వ్యవహారిస్తారు. ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటు అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలతో…
మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలతో పాటు మరో 142 గ్రామాలతో మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. మహబూబ్ నగర్ రూరల్ మండలానికి చెందిన 16, హన్వాడ మండలానికి చెందిన 13, నవాబ్ పేట మండలంలోని 20 గ్రామాలను ఇందులో చేర్చారు. రాజాపూర్ మండలంలోని 16, జడ్చర్ల మండలంలోని 22, భూత్పూర్ మండలంలోని 13, మూసాపేట మండలంలోని 12 గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. దేవరకద్ర మండలానికి చెందిన 5, కోయిల్ కొండ మండలానికి చెందిన 8, గండీడ్ మండలానికి చెందిన ఒక గ్రామంతో పాటు బాలానగర్ మండలానికి చెందిన 15 గ్రామాలను మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధి సంస్థలో ప్రభుత్వం చేర్చింది. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ చైర్మన్, వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ వ్యవహారించనుండగా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డితో పాటు పలువురు అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్‌లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.