Thursday, January 23, 2025

పట్టణ ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణ ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సూర్యాపేట,కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని పారిశుధ్యం పై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కావున నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి శుభ్రతకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పారిశుద్ధ నిర్వహణలో భాగంగా రానున్న వర్షాకాలం దృష్టా సీజనల్ వ్యాధులు అరికట్టుటకు పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణ సజావుగా జరగాలన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా 10లక్షల మొక్కలు ఈ నెల చివరి కల్లా 100శాతం నాటాలని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీల వారిగా తమకు కెటాయించిన టార్గెట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.

ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీటి సరఫరా లీకేజీలు లేకుండా వాటర్ పొల్యూషన్ కాకుండా చూడాలన్నారు. ఆస్తిపన్నులను సకాలంలో సేకరించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కులవృత్తుల పైనే ఆధారపడిన వారి ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించడం కోసం దరఖాస్తు చేస్తున్న లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు రామానుజుల రెడ్డి, మహేశ్వర రెడ్డి, వెంకటేశ్వర్లు, దండు శ్రీను, పిడి మెప్మా రమేష్ నాయక్, మున్సిపల్ ఈఈ జికేడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News