Saturday, December 21, 2024

హోమ్ థియేటర్ సౌండ్ బార్‌ల విభాగంలోకి ప్రవేశించిన అర్బన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుప్రసిద్ధ స్వదేశీ సాంకేతికత బ్రాండ్ అయిన అర్బన్, తమ హార్మోనిక్ సిరీస్ సౌండ్‌బార్‌లను విడుదల చేయడం ద్వారా హోమ్ ఆడియో విభాగంలోకి ప్రవేశించింది. వివిధ విభాగాలను దృష్టిలో ఉంచుకుని, బ్రాండ్ హార్మోనిక్ 2240 విత్ డాల్బీ సరౌండ్ సౌండ్ & హార్మోనిక్ 1120 డీప్ బాస్ హెచ్‌డి సౌండ్‌ను విడుదల చేసింది. హార్మోనిక్ సిరీస్ ఆకట్టుకునే సౌండ్ క్వాలిటీ, సొగసైన సౌందర్యం, అధునాతన ఫీచర్‌లను అందిస్తుంది.

రూ. 9999 ప్రారంభ ధర వద్ద అందుబాటులో వుండే అర్బన్ హార్మోనిక్ సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా అందుబాటులో ఉంది.

ఈ ఆవిష్కరణ గురించి అర్బన్ సహ-వ్యవస్థాపకుడు ఆశిష్ కుంభట్ మాట్లాడుతూ.. “మేము హార్మోనిక్ సౌండ్‌బార్ శ్రేణిని పరిచయం చేస్తున్న వేళ, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, సొగసైన డిజైన్, అధునాతన ఫీచర్‌ల అసమానమైన సమ్మేళనాన్ని అందించడం ద్వారా ఆడియో ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్వచించడమే మా లక్ష్యం. అర్బన్ నూతన ఆవిష్కరణలు, కస్టమర్ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచడం, సాటిలేని ఆడియో అనుభవాలను అందించడంలో మా నిబద్ధతను కొనసాగించనుంది” అని అన్నారు.

అర్బన్ హార్మోనిక్స్ 2240 ప్రారంభ ధర రూ.12,999 వద్ద అందుబాటులో ఉండగా, హార్మోనిక్ 1120 తగ్గింపు ధర రూ. 9,999 వద్ద అందుబాటులో ఉంది. హార్మోనిక్ 2240 డాల్బీ ఆడియో టెక్నాలజీతో వస్తుంది, అయితే అర్బన్ 1120 అర్బన్ సిగ్నేచర్ ట్యూన్డ్ సౌండ్‌తో వస్తుంది. అర్బన్ హార్మోనిక్‌ను కంపెనీ వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, భారతదేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్‌ల ద్వారా రూ.9,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News