Friday, November 22, 2024

అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారంగా, జాతీయ రహదారి పై ఉన్న కోదాడ నియోజకవర్గ అభివృద్ధి పై అసెంబ్లీ సమావేశాల్లో ఆదివారం కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రస్తావించారు. కోదాడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రా మాల్లో ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చే యాలని మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. కోదాడ పెద్ద చెరువుతో పాటు కొమరబండ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞ ప్తి చేశారు.

నిధులు మంజూరు చేసిఈ రెండు చెరువులను అభివృద్ధి చేయాలని, మంత్రి కేటీఆర్ కోదాడ పట్టణాన్ని దత్తత తీసుకోవాలని ఆయన సభలో విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు కోదాడ ముప్పై పడకల ఆసుపత్రిని తన అభ్యర్ధన మేరకు వంద పడకల వైద్యశాలగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.

అదే విధంగా కోదాడ ప్రాంతం నుండి క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులు ఉన్నారని, క్రీడాకారుల సౌకర్యార్ధం కోసం మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రిని కోరారు. కాగా కోదాడ నియోజకవర్గ అభివృద్ధి పై అసెంబ్లీలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రస్తావించిన ప్రతిపాదనలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించి చెరువుల సందరీకరణ, స్టేడియం ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News