Thursday, January 23, 2025

దేశంలో వేగంగా పట్టణీకీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజ

- Advertisement -
- Advertisement -

పట్టణాల్లోని పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు…
సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం శ్రమిస్తా
రాష్ట్ర మున్సిపల్ చైర్‌పర్సన్‌ల ఛాంబర్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు


మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలో వేగంగా పట్టణీకీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, పట్టణాల్లోని పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు పనిచేస్తున్నారని రాష్ట్ర మున్సిపల్ చైర్‌పర్సన్‌ల ఛాంబర్ చైర్మన్‌గా వెన్‌రెడ్డి రాజు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా తాను పనిచేస్తానని, తనను ఈ పదవికి ఎంపిక చేసిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం శ్రమిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ చైర్‌పర్సన్‌ల ఛాంబర్ చైర్మన్‌గా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పురపాలక శాఖ చైర్మన్‌గా రాజు వెన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎడ్మ సత్యంరెడ్డి (కల్వకుర్తి చైర్మన్), ఉపాధ్యక్షురాలిగా సిహెచ్ మంజుల (వికారాబాద్ చైర్‌పర్సన్)లు నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ చైర్‌పర్సన్‌ల ఛాంబర్ చైర్మన్‌గా వెన్‌రెడ్డి రాజు ‘మనతెలంగాణతో’ మాట్లాడుతూ
అన్ని రంగాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన అవగాహనతో ఉన్న దేవుడిలాంటి మంత్రి కెటిఆర్ ప్రజలకు దొరకడం అదృష్టమన్నారు. భావితరాలకు మంత్రి కెటిఆర్ దిక్సూచీ అని ఆయన పేర్కొన్నారు. దేశ భవితకు రానున్న రోజుల్లో సిఎం కెసిఆర్ మార్గదర్శం అవుతారని ఆయన తెలిపారు.
కొత్త మున్సిపాలిటీలకు అధికంగా నిధులు…
ప్రస్తుతం పట్టణీకీకరణ శరవేగంగా జరుగుతోందని, పట్టణాభివృద్ధి ద్వారానే ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి అధిక నిధులను కేటాయిస్తూ శరవేగంగా వాటి అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందన్నారు. దీంతోపాటు ప్రతి బడ్జెట్‌లో గ్రీన్‌బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడంలో దేశంలోనే ముందుందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు తగినన్నీ నిధులను సమకూర్చి వాటి అభివృద్ధికి దోహదం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని మరింత వృద్ధిలోకి తీసుకెళుతోందన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా, తండాలను పంచాయతీలుగా గుర్తించి ఆయా గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటునందిస్తోందని ఆయన తెలిపారు. విద్య, వైద్యాన్ని అన్ని గ్రామాలకు అందించడంలో ప్రభుత్వం విజయవంతం అయ్యిందని రాజు వెన్‌రెడ్డి పేర్కొన్నారు.

నిరంతరం సైనికుడిలా పోరాడతా

అన్ని మున్సిపాలిటీల నుంచి నిధులను రాబట్టడంలో తన వంతు కృషి చేస్తానని రాజు వెన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అన్ని పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో టిఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాలను గెలిచేలా అన్ని మున్సిపాలిటీ చైర్మన్‌లతో కలిసి కృషి చేస్తానని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల నేతృత్వంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులందరూ గెలిపించడానికి ప్రభుత్వంతో కలిసి నిరంతరం శ్రమిస్తానని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేలా నిరంతరం సైనికుడిలా పోరాడతానని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News