Saturday, November 23, 2024

పట్టణ ప్రగతి, గిరిజనోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాల్లో భాగంగా 16,17వ తేదీలలో నిర్వహించనున్న పట్టణ ప్రగతి, గిరిజనోత్సవ కార్యక్రమాలపై మున్సిపల్, ఐటిడిఎ ఏపివో జనరల్ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపాలిటీలలో జాతీయ జెండా ఎగురవేయాలని అన్నారు. అనంతరం పట్టణ ప్రగతి ద్వారా మునిసిపాలిటీలకు వచ్చిన నిధుల వివరాలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్ధిని, పట్టణంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు.

పారిశుధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలన్నారు. జాతీయ స్థాయిలో పట్టణాభివృద్ధిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలని సూచించారు. పట్టణాల్లో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్‌వేజ్ మార్కెట్ల గురించి, వైకుంఠదామాల నిర్మాం, డంప్ యార్డులు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణం, పచ్చదనాన్ని పెంపొందించేందుకు 10 శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయించడం తదితర అభివృద్ధి అంశాలపై ప్రముఖంగా ప్రస్తావించాలని అన్నారు. జూన్ 17వ తేదీన శనివారం నిర్వహించనున్న తెలంగాణ గిరిజనోత్సవం గురించి ప్రస్తావిస్తూ గిరిజన గ్రామాల్లో సభలు, గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలని అన్నారు.

గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించిన తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్స్ 10 శాతం పెంచిన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలన్నారు. గిరిజనోత్సవం నిర్వహణకు, ముస్తాబు చేయాలని ఏపివో జనరల్ డేవిడ్ రాజుకు సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్సులో ఐటిడిఎ ఏపివో జనరల్ డేవిడ్ రాజు, కొత్తగూడెం, ఇల్లందు,పాల్వంచ, మణుగూరు మునిసిపల్ కమీషనర్లు, రఘు, అంకుష్ వలి, శ్రీకాంత్, ఉమా మహేశ్వరరావు, పట్టణ ప్రగతి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News