Monday, December 23, 2024

తెలంగాణ పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ రూరల్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగ ంగా శుక్రవారం కొల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ ప్రగ తి దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి మున్సిపల్ చైర్‌పర్సన్ రఘప్రోలు విజయలక్ష్మిచంద్రశేఖర చారి, కమిషనర్ సొంటె రాజయ్య, కౌన్సిలర్లు, కో ఆప్ష న్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పాలక వర్గం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.

అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, చెత్త సేకరణకు ట్రాక్టర్లు, హరితహారం కోసం ట్యాంకర్లు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, డంప్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో పల్లెలు, పట్టణాలు శోభాయమానంగా విలసిల్లుతున్నాయని అన్నారు. సిఎం కెసిఆర్ ఆలోచనలు, మంత్రి కెటిఆర్ మార్గదర్శకంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో తెలంగాణ పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

వారి సహకారంతో కొల్లాపూర్ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు మంజూరు చేసుకున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మిలు కౌన్సిలర్లకు, కో ఆప్షన్ సభ్యులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు నుంచి మంజూరైన రెండు కోట్ల రూపాయల చెక్కులను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News