Wednesday, April 2, 2025

టర్కీలో 40 ఏళ్ల తిరుగుబాటుకు ముగింపు పలికిన కుర్దిష్ ఉగ్రవాదులు

- Advertisement -
- Advertisement -

టర్కీలో 40 ఏళ్లుగా తిరుగుబాటు చేస్తూ వచ్చిన కుర్దిష్ ఉగ్రవాదులు శనివారం కాల్పుల విరమణ ప్రకటించారు. జైలులో ఉన్న కుర్దిష్ నాయకుడు తన సమూహానికి నిరాయుధీకరణకు పిలుపునిచ్చిన రెండు రోజుల తర్వాత అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభుత్వానికి గణనీయమైన ప్రోత్సాహం లభించింది. అధ్యక్షుడు బషర్ అస్సాద్ పతనం తర్వాత పొరుగున ఉన్న సిరియాలో అధికార పునర్నిర్మాణం, లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్ ఉద్యమం బలహీనపడటం, గాజాలో ఇజ్రాయెల్-హమాస్ వంటి ప్రాంతంలోని ప్రాథమిక మార్పుల నేపథ్యంలో కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ లేక పికెకె చేసిన ప్రకటన ఈ కాల్పుల విరమణ. ఈ కాల్పుల విరమణ ప్రకటనను ఆ గ్రూపునకు సన్నిహితమైన మీడియా సంస్థ

‘ఫిరాత్ న్యూస్ ఏజెన్సీ’ శనివారం ప్రచురించింది. కాగా 1999 నుండి తుర్కియే జైలులో ఉన్న తిరుగుబాటుదారుల నాయకుడు అబ్దుల్లా ఒకలాన్‌ను ప్రస్తావిస్తూ ఈ ప్రకటనను ప్రచురించింది. ఇదిలావుండగా టర్కీ, పికెకె మధ్య ఘర్షణ 1984లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పదివేల మరణాలకు అది దారితీసింది. అయితే అమెరికా మద్దతు ఉన్న కుర్దిష్ నేతృత్వంలోని సిరియా డెమోక్రటిక్ ఫోర్సెస్ నాయకుడు మాత్రం ఒకలాన్(75) ఇచ్చిన కాల్పుల విరమణ పిలుపు సిరియాలోని తన దళాలకు వర్తించదని అన్నారు. ఇదిలావుండగా ఇమ్రాలీ కారాగారం నుంచి ఒకలాన్‌ను విడుదల చేయాలని పికెకె వినతి చేసింది. అయితే ఎర్డోగాన్ సంకీర్ణ భాగస్వామి డెల్వెట్ బహ్సెలి మాత్రం ఆయన గ్రూప్ హింసను వీడనాడితేనే పేరోల్ ఇవ్వాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News