47వేల టన్నుల సరుకుతో నౌక సిద్ధం
వాషింగ్టన్ /న్యూఢిల్లీ : భారతదేశం తొట్టతొలిసారిగా అమెరికా నుంచి భారీ స్థాయిలో యూరియాను దిగుమతి చేసుకోనుంది. వచ్చే కొద్ది నెలల్లోయూరియా లోడ్‌తో అమెరికా నుంచి పలు సరుకు రవాణా నౌకలు భారత్‌కు బయలుదేరి రానున్నాయి. ఈ విషయాన్ని పరిశ్రమల విషయాల నిపుణులు తెలిపారు. పలు దేశాలకు తమ దేశ దిగుమతుల విస్తృతం దిశలో ఇది తగు సంకేతం అని అమెరికా పేర్కొంటోంది. 47000 టన్నుల గ్రాన్యులర్ యూరియాతో కూడిన దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ నౌక అమెరికాలోని న్యూ ఓరేలాన్స్ రేవు నుంచి ఇండియాలోని న్యూ మంగళూరు పోర్టుకు బయలుదేరుతోంది. టన్నుకు 716.5 డాలర్ల ధరతో ఈ ఎరువును ఇండియా కొనుగోలు చేసింది. రవాణా ఛార్జీలు అదనంగా ఉంటాయి. ఇది దాదాపు 75 డాలర్ల వరకూ పలుకుతుంది.
ఇప్పటివరకూ అమెరికా నుంచి అడపాదడపా యూరియా ఎగుమతి జరుగుతోంది. 201920లో ఇండియాకు అమెరికా నుంచి యూరియా దిగుమతి కేవలం 1.47 టన్నులే ఉంది. తరువాతి క్రమంలో 202021లో ఇది 43 టన్నులకు చేరింది. అయితే ఇప్పుడు ఒకేసారి 47000 టన్నుల సరుకు అమెరికా నుంచి ఇండియాకు రవాణాకు సిద్ధం అవుతోంది. ఇంత భారీ స్థాయిలో అమెరికా నుంచి యూరియాను దిగుమతి చేసుకోవడం భారత్‌కు తొలిసారి అవుతోంది. అమెరికా నుంచి యూరియా దిగుమతికి ఈ ఏడాది మే 11వ తేదీనే ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్త టెండర్ల ప్రక్రియ ద్వారా దిగుమతి అవకాశం దక్కించుకుంది.