Thursday, January 23, 2025

ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

శంకర్‌పల్లి: ఉరేసుకుని శంకర్‌పల్లి హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండ లం మారేపల్లి గ్రామానికి చెందిన మీసాల మాణిక్యం (52) సంగారెడ్డిలోని అయ్యప్ప కాలనీలో నివాసము ంటూ సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. కాగా మాణిక్యానికి ఇటీవల హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి రావడంతో సైబరాబాద్ పరిధిలోని మోకిల పోలీస్ స్టేషన్‌కు ఈ నెల జూన్ 10న వచ్చాడు. అయితే హెడ్ కానిస్టేబుల్ మాణి క్యం సంగారెడ్డిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య ప్రశాంతి, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News