Wednesday, January 22, 2025

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహాత్య

- Advertisement -
- Advertisement -

నల్గొండ : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహాత్య చేసుకున్న సంఘటన నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ రౌతు గోపి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని బీటీఎస్‌కి చెందిన పప్పుల ఓం ప్రకాష్(53) మున్సిపాలిటీలో వాటర్ ఫిట్టర్గా పని చేస్తున్నాడు.

అదే విభాగంలో పని చేస్తున్న సహోద్యోగి చింత ఎల్లయ్యకు శ్రీరామ్ చిట్స్‌లో జమానత్ ఉన్నాడు. ఎల్లయ్య ఈఎంఐ చెల్లించకపోవడంతో జమానత్ ఉన్న ఓం ప్రకాష్ అకౌంట్ నుంచి రూ.10 వేలు ఈఎంఐకి కట్ అయ్యాయి. ఈ విషయంపై ఆయన భార్య నిలదీయగా త్వరలోనే పేమెంట్ చేస్తానని అంగీకరించారు.

తన పెద్ద కూతురు ప్రెగ్నెంట్ ఉండడం వల్ల మెడికల్ చెక్ అప్ కు సోమవారం హైదరాబాద్ వెళ్లారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా ఓం ప్రకాష్ డోర్ తెరవలేదు. అను మానం వచ్చిన కుమారుడు చరణ్ తేజ్ డోర్స్ సందులోంచి చూడగారేకుల కు ఉన్న ఇను పరాడుకు ప్లాస్టిక్ ప్యాకింగ్ వైర్ సహాయంతో ఉరి వేసుకున్నాడు. మరో డోర్ ఓపెన్ చేసి చూసే సరికి ఓం ప్రకాష్ చనిపోయాడు. మృతుడి భార్య పప్పుల లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News