Saturday, January 11, 2025

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

శామీర్‌పేట: ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. శామీర్‌పేట పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శామీర్‌పేట మండ లం అలియాబాద్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ యాదవ్ అలియాస్ జగదీష్ (23) సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లిన జగదీష్ మంగళవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు.

దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వారి వద్ద బంధువుల వద్ద ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. అలియాబాద్ నుంచి బాబాగూడా వెళ్లే దారిలోని వ్యవసాయ పొలాల్లో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకున్నారని సమాచారం తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి చూడగా జగదీష్ అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో శామీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జగదీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News