Monday, December 23, 2024

రామోజీ నన్ను తుపాకీతో బెదిరించారు: యూరి రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మార్గదర్శిలో బిజె రెడ్డి ప్రమోటర్, డైరెక్టర్‌గా ఉన్నారని సిఐడి అధికారి శివరామ్ రెడ్డి తెలిపారు. మార్గదర్శిలో 1962లోనే రూ.5 వేల మూలధనం బిజె రెడ్డి పెట్టారని, 1985లో బిజె రెడ్డి చనిపోయారని, 2014లో మార్గదర్శిలో బిజెరెడ్డికి షేర్లు ఉన్నట్టు మీడియా ద్వారా తెలిసిందన్నారు. మార్గదర్శిలో రామోజీరావుతో కలిసి ఆరుగురు ప్రమోటర్లు ఉన్నారని, ఎండిగా ఉన్న శైలజకు కేవలం వంద షేర్లు మాత్రమే ఉన్నాయని, మార్గదర్శి టర్న్ ఓవర్ రూ.1700 కోట్లుగా ఉందని శివరామ్ రెడ్డి వెల్లడించారు.

యూరి రెడ్డి అనుమతి లేకుండానే షేర్లు వేరేవారికి బదలాయించారని, యూరి రెడ్డి షేర్లను ఎండిగా ఉన్న శైలజా కిరణ్‌కు బదలాయించినట్లు తేలిందన్నారు. 1962 నుంచి తన తండ్రి పేరు మీద మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని యూరి రెడ్డి పేర్కొన్నారు. మీ నాన్న నాకు హ్యాండ్ లోన్ కింద డబ్బులు ఇచ్చారని, అది తిరిగి ఇచ్చామని రామోజీరావు మోసం చేశారని, తన చేత బలవంతం మీద సంతకం చేయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపణలు చేశారు. తనని సంతకం పెట్టాలని రామోజీ రావు తుపాకీతో బెదిరించిన విషయాన్ని యూరి రెడ్డి గుర్తు చేశారు. తనతో పాటు తన సోదరుడు కూడా ఈ షేర్లలో భాగస్వామిగా ఉన్నారని చెప్పారు.

రామోజీ రావు, శైలజ క్వాష్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. యూరిరెడ్డి ఫిర్యాదుతో రామోజీ, శైలజలపై సిఐడి అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సిఐడి ఎఫ్‌ఆర్‌ఐపై క్వాష్ పిటిషన్‌ను రామోజీ, శైలజ పిటిషన్ దాఖలు చేశారు. రేపటి వరకు రామోజీరావుపై తీవ్ర చర్యలు తీసుకోమని కోర్టుకు సిఐడి న్యాయవాది పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News