Monday, December 23, 2024

యువకుడి దారుణ హత్యకు దారితీసిన గోడపై మూత్రవిసర్జన గొడవ

- Advertisement -
- Advertisement -

Urinating on wall led to youth's gruesome murder

 

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఓ వ్యక్తిని వెంటాడి మరీ కత్తితో హతమార్చారు. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ చివరికి పెద్దదిగా మారి హత్యకు దారి తీసింది. మయాంక్(25) అనే హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి గురువారం సాయంత్రం ఓ ఇంటి గోడపై మూత్రం పోశాడు. అయితే ఆ ఇంటి యాజమానురాలు మయాంక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇంటి యజమానురాలు కొడుకుమనీష్ జోక్యం చేసుకోవడంతో మయాంక్ అతడిపై దాడి చేశారు. మయాంక్ దాడిని జీర్ణించుకోలేని మనీష్ తన స్నేహితులను పిలిచి మయాంక్‌ను వెంబడించాడు. దక్షిణ ఢిల్లీ డీడీఏ మార్కెట్ సమీపంలో మాలవియా నగర్ దగ్గర అంతా చూస్తుండగానే మయాంక్‌ను వెంటాడి పొడిచి చంపేశారు. ఘటన తర్వాత నిందితులంతా తలోదిక్కు పారిపోయారు. మయాంక్‌ను స్థానికులు ఎయిమ్స్ తరలించారు. అప్పటికే మయాంక్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు మనీష్, రాహుల్, అశిశ్, సూరజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News