Monday, December 23, 2024

గిరిజనుడిపై మూత్ర విసర్జన.. బిజెపి నేత అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఇండోర్: అత్యంత అమానవీయమైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ గిరిజన వ్యక్తి మీద మూత్రం పోస్తూ పైశాచికంగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియోను ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ట్యాగ్ చేస్తూ.. సదరు వ్యక్తిపై, బిజెపిపై తీవ్ర స్థాయిలో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన పోలీసులు ఆదివాసీపై మూత్ర విసర్జనకు పాల్పడిన బిజెపి నేతపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనలో విచారణ కొనసాగుతోందని, నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిద్ధి ఎఎస్పి అంజు లతా పాటిల్ పేర్కొన్నారు.

Also Read: నాగాలాండ్‌లో ఘోర ప్రమాదం..(వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News