Sunday, January 19, 2025

బ్రెయిన్ ట్యూమర్లను కనుక్కునే మూత్ర పరీక్ష..

- Advertisement -
- Advertisement -

రోగులకు బ్రెయిన్ ట్యూమర్ ఉందనే విషయాన్ని ముందుగానే తెలుసుకునే కొత్త సాధనాన్ని జపాన్ నగోయా యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. బ్రెయిన్ ట్యూమర్ ఉందన్న సంకేతాన్ని తెలియజేసే మూత్రం లోని కీలకమైన పొరతో కూడిన ప్రొటీన్‌ను ఈ సాధనం కనుగొనగలుగుతుంది. ఈ అధ్యయనం ప్రకారం బ్రెయిన్ క్యాన్సర్‌ను కనుగొనడానికి ఈ ప్రొటీన్‌ను ఉపయోగపడుతుందని, దీనివల్ల హానికరమైన పరీక్షలు చేయవలసిన అవసరం తప్పుతుందని, సర్జరీ అవసరమైన ట్యూమర్లు పెరుగుదలను కనుగొనడమౌతుందని పరిశోధకులు వివరించారు.

ఇతర రకాల క్యాన్సర్‌ను గుర్తించడానికి ఈ విధానం ఉపయోగపడవచ్చని వీరు అభిప్రాయపడుతున్నారు. జర్నల్ ఎసిఎస్ నానోలో ఈ పరిశోధన వెలువడింది. అనేక రకాల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించగలగడంతో క్యాన్సర్ రోగుల మనుగడ శాతం (survival rate) పెరిగినప్పటికీ, బ్రెయిన్ ట్యూమర్ల రోగుల మనుగడ శాతం గత ఇరవై ఏళ్లుగా అలాగే ఉంటోంది. ఇలా జరగడానికి ట్యూమర్లను ఆలస్యంగా గుర్తించడం కొంత కారణం. సాధారణంగా వైద్యులు రోగి చలనం లేకపోవడం లేదా మాట్లాడలేక పోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు కనిపించిన తరువాత బ్రెయిన్ ట్యూమర్లను కనుగొనడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అప్పటికే ట్యూమర్లు బాగా పెరిగి ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News