ఊర్కొండ: నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ గ్రామ సమీపంలోని ఆంజనేయ స్వామ ఆలయం వద్ద భార్యభర్తలు కాదు అని తెలుసుకొని అతడిని చెట్టుకు కట్టేసి మహిళపై ఏడుగురు అత్యాచారం చేశారని ఐటి సత్యనారాయణ తెలిపారు. ఆలయ సమీపంలోని మహిళపై జరిగిన అత్యాచారం ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడిని ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించామని, గతంలో ప్రేమికులను, మైనర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తేలిందన్నారు.
“శనివారం రాత్రి ఓ జంట బైక్‌పై రావడాన్ని నలుగురు నిందితులు గమనించారు. జంట అనుమానాస్పదంగా కనిపించడంతో మరో ముగ్గురికి పోన్ చేసి రమ్మని కబరు పంపారు. ఏడుగులు అక్కడికి చేరుకొని యువకుడిని చెట్టుకు కట్టేసి ఆమెపై ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి తేరుకొని చెట్టుకు కట్టేసిన యువకుడిని కట్టు విప్పింది. అనంతరం జంట వెళ్తుండగా మహేశ్ కుమార్ గౌడ్ ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని వారిని బెదిరించాడు. యువతి బంగారు ఆభరణాలు, డబ్బు దొంగతనం చేశారని ఊర్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆలయ సమీపంలో సిసి కెమెరాలను పరిశీలించగా మహేశ్ కుమార్ గౌడ్ వారిని బెదిరించినట్లు కనిపించింది. వెంటనే మహేశ్ కుమార్ గౌడ్‌తో పాలు మరికొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అత్యాచారం చేశామని నిజాలు ఒప్పుకున్నారు. నిందితులు మట్ట అంజనేయులు గౌడ్, మారుపాకు ఆంజనేయులు గౌడ్, మణికంఠగౌడ్, హరీశ్ గౌడ్, సాధిక్ బాబా, ఎల్లికట్ట గ్రామానికి చెందిన కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు, హైకోర్టుకు సమర్పించి ఈ కేసులో నిందితులకు త్వరితగిన కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం” అని ఐజి సత్యనారాయణ స్పష్టం చేశారు.