Wednesday, January 22, 2025

సూపర్ నేచురల్ ఫాంటసీ మూవీ.. ‘ఊరు పేరు భైరవకోన’ టీజర్

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్‌ల ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైరవకోన’ విడుదలకు సిద్ధమవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సినిమా కథ కొత్తగా, కథనం ఎంగేజింగ్‌గా వుంది. ఫాంటసీ సబ్జెక్ట్‌లను అందించడంలో దిట్ట అయిన విఐ ఆనంద్ భైరవకోనని అద్భుతంగా తీర్చిదిద్దారు.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ… చాలా మంచి విషయాలు, వినోదాత్మక విషయాలు ఉన్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఇదని అన్నారు. విఐ ఆనంద్ మాట్లాడుతూ… ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సూపర్ నేచురల్ ఫాంటసీ మూవీ ఇదని చెప్పారు. అనిల్ సుంకర మాట్లాడుతూ… ఈ సినిమా సందీప్‌కు మెమరబుల్ గిఫ్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావ్య థాపర్, రాజేష్ దండా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News