Wednesday, January 22, 2025

ఊరూరా దశాబ్ది ఉత్సవాలు పండుగలా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

వెల్దుర్తి: దశాబ్ది ఉత్సవాలను ఊరూరా పండుగలా నిర్వహించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి స్వరూప అధ్యక్షతన ఆయా శాఖల అధికారులకు, గ్రామ సర్పంచ్‌లకు, ఎంపిటిసిలకు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి సన్నాహక సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. జూన్ 2 నుంచి 20 రోజలు పాటు దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని అందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

అలాగే మండలంలోని హస్తాల్‌పూర్ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన శ్రీబాలాజీ రైస్ ఇండస్ట్రీని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలకా్ష్మరెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రమేష్‌గౌడ్, తహశీల్దార్ నాగవర్దన్, ఎంపిడిఓ వెంకటక్ష్మమ్మ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఆయా శాఖల అధికారులు తదిరతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News