ఝరాసంగం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా ఝరసంగం మండలంలోని ఏడాకులపల్లి, జిర్లపల్లి, బర్దిపూర్, గంగాపూర్, మేదపల్లి, చిలేపల్లి గ్రామాలలోని చెరువుల వద్ద చెరువు పండుగలను ఘనంగా నిర్వహించారు, భాజా భాజంతులతో బతుకమ్మలు, బోనాల ఊరేగింపుతో చెరువుల వద్దకు చేరుకొని కట్ట మైసమ్మకు బోనాల నైవేద్యం చేశారు. మండలంలోని ఏడాకులపల్లి నిర్వహించిన చెరువు పండుకు ఎమ్మెల్యే మాణిక్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 66 చెరువులు కుంటలు చెక్ డ్యాములు ఉన్నాయని ఇందులో మిషన్ కాకతీయ ఫేస్ 1 నుంచి ఇప్పటివరకు 52 చెరువులకు మరమ్మతుల కోసం రూ. 736.37 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. 2014 కు ముందు సగటు భూగర్భ జలమట్టం 15.59 మీటర్లు అయితే మిషన్ కాకతీయ పనులు చేపట్టిన తర్వాత మండల పరిధిలో భూగర్భ జలమట్టం 6.76 మీటర్లకు పెరిగిందని వివరించారు. బిఆర్‌ఎస్ నాయకులు, అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.