Monday, December 23, 2024

ఊరూర ‘మిషన్ భగీరథ’ మంచినీళ్ల పండుగ

- Advertisement -
- Advertisement -

తెలకపల్లి : మండల కేంద్రంలో, పరిసర గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిషన్ భగీరథ మంచినీళ్ల పండుగ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామాలలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల వద్ద మామిడి, కొబ్బరి తోరణాలు అలంకరించారు.

అదే విధంగా వాటర్ ట్యాంకుల ముందు వేసిన రంగురంగుల ముగ్గులు అలరించాయి. గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు, పంచాయతి కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామాల పురవీధుల గుండా మంచినీళ్ల పండుగ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు.

2014 ముందు తర్వాత గ్రామాలలో ఏర్పాటు చేసిన శుద్ధి మంచినీటిని, జరిగిన ప్రగతిని, మంచినీళ్లకు వచ్చిన నిధుల వివరాలను ప్రజలకు వివరించారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపిటిసిలు, పంచాయతి కార్యదర్శులు, గ్రామ పంచాయతి సిబ్బంది, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News