Sunday, November 24, 2024

ఊరూరా చెరువుల పండగను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

మెదక్: ఎన్నికలలో ఎంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తామో అంతే బాద్యతతో అధికారులు టీం స్పిరిట్‌తో పనిచేసే ఊరూరా చెరువుల పండుగను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. బుధవారం ట్యాంక్ ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్పరెన్స్‌లో మాట్లాడుతూ (ట్యాంక్)చెరువుల ప్రత్యేకాధికారులు రాత్రి అక్కడే బస చేసి చెరువుల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్పరెన్స్‌లో మాట్లాడుతూ(ట్యాంక్)చెరువుల ప్రత్యేకాధికారులు రాత్రి అక్కడే బస చేసి పరిసర ప్రాంతాలను సభాస్థలికి అనుకూలంగా చదును చేసి, చక్కటి లైటింగ్, డీజే సౌండ్ ఏర్పాటు చేయాలని, గోరేటి వెంకన్న పాటలు వినిపించాలన్నారు.

బోనాలు, బతుకమ్మలతో సాయంత్రం 5 గంటల వరకు కోలాహలంగా చెరువు కట్టకు చేరుకునేలా జన సమీకరణ చేయాలని, రంగోలి, పూలతో అలంకరించాలని, కట్ట మైసమ్మ వద్ద పూజలు నిర్వహించాలన్నారు. రాత్రి బోజనం ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి చెరువు వద్ద 2 నుంచి 4 గజ ఈతగాళ్లను నియమిచ్చామని, పెట్రోలింగ్‌కు పోలీసులతో సమన్వయం చేసుకోవాలని గ్రామ, మండల అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నామని అన్నారు. 9,10 తేదీలలో దొరక్క గార్డెన్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందని అన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించుటకు తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమీషనర్లకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News