Monday, December 23, 2024

ఊర్వశికి క్లీన్ బౌల్డ్ అయినా పంత్, జడేజా

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అందాచందాలకు టీమిండియా క్రికెటర్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. ఊర్వశి వర్సెస్ పంత్, ఊర్వశి వర్సెస్ జడేజా అంటూ సోషల్ మీడియాలో రూమర్లు ప్రారంభమయ్యాయి. గతంలో రిషబ్ పంత్ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఊర్వశి కోసం చాలా సమయం వేచిచూశాడని పుకార్లు వచ్చాయి. ఊర్వశి కూడా నిజమేనని చెప్పడంతో పంత్ గందరగోళంలో పడ్డాడు. ఈ అమ్మడు ఖాతాలో మరో యువ క్రికెటర్ నషీమ్ షా కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Also Read: అన్నదమ్ముల కథ.. ఎవరు హీరో.. ఎవరు విలన్?

బాలీవుడ్ నటిమణులో ఎవరు సెక్సీగా ఉంటారని టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఓ ఇంటర్యూలో అడిగారు. వెంటనే ఊర్వశి పేరు చెప్పడంతో ఆమె క్రేజ్ ఆమాంతం పెరిగిపోయింది. రిషబ్ పంతకు ప్రమాదం జరిగిన తరువాత మెరుగైన వైద్యం కోసం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు. ఊర్వశి కూడా ఆ ఆస్పత్రికి వచ్చినట్టు ఫోటోలు వైరల్‌గా మారాయి. పంత్ చికిత్స తీసుకుంటుండగా ఆమె అక్కడికి ఎందుకు వెళ్లిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పంత్ ఊర్వశి మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News