Thursday, January 23, 2025

బోయపాటి సినిమాలో ఐటమ్ సాంగ్

- Advertisement -
- Advertisement -

మాస్ అండ్ యాక్షన్ సినిమాలకు దర్శకుడు బోయపాటి శ్రీను కేరాఫ్‌గా నిలుస్తారు. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి తొలి సినిమాతోనే డైరెక్టర్‌గా తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బోయపాటి-, బాలయ్య కాంబినేషన్ సూపర్ హిట్టుగా నిలిచింది. సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్‌బస్టర్స్ వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఇక బోయపాటి తన తదుపరి చిత్రాన్ని రామ్ పోతినేనితో చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా మిస్ ఇండియానే రంగంలోకి దించుతున్నాడని టాక్ వినిపిస్తోంది. మిస్ ఇండియా విజేత, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను ఐటమ్‌సాంగ్ కోసం సంప్రదించినట్లు తెలిసింది. ఊర్వశి రౌతేలా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి అలరించింది. ఈ మేరకు రామ్ పోతినేని సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఊర్వశి రౌతేలా నటించిన తాజా చిత్రం ’బ్లాక్ రోజ్’ త్వరలోనే హిందీ.. తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News