Thursday, February 20, 2025

చిరు దేవుడులాంటి వారు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. నటసింహం బాలయ్య దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో ‘దబిడి దిబిడి’ సాంగ్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే, ఈ బ్యూటీ తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి గురించి మాట్లాడుతూ ఊర్వశి రౌతేలా పొగడ్తల వర్షం కురిపించింది. చిరు తనకు దేవుడి లాంటి వారని ఆమె అన్నారు.

తన తల్లి కాలికి ఫ్రాక్చర్ అయ్యి, నొప్పితో బాధపడుతున్నారని మెగాస్టార్‌కు చెప్పగా, ఆయన వెంటనే వైద్యులతో మాట్లాడి తన తల్లికి మెరుగైన వైద్యం అందేలా చేశారని ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది. ఊర్వశి రౌతేలా ఇంకా మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అలా చెప్పడం కారణంగానే తన అమ్మకు సర్జరీ బాగా జరిగిందని, ఆమె తన సమస్య నుంచి పూర్తిగా కోలుకుందని, ఇప్పుడు తన తల్లికి ఎలాంటి సమస్య లేదని ఊర్వశి వెల్లడించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్ సోషెల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News