Tuesday, December 31, 2024

ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందో అంతే కథ, డ్రామా

- Advertisement -
- Advertisement -

Urvasivo Rakshasivo movie release on Nov4

జిఎ2 పిక్చర్స్‌లో తెరకెక్కుతున్న యంగ్ హీరో అల్లు శిరీష్ తాజా చిత్రం ‘ఉర్వశివో రాక్షసివో’. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యూల్‘ హీరోయిన్‌గా నటించింది. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ సినిమాను చూసిన వారందరూ ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణిలు చాలా మంచి పాటలు ఇచ్చారు.

ఈ నెల 30న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నాము”అని అన్నారు. చిత్ర దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ “నేటి యూత్ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అన్న పాయింట్‌ను బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫ్రెష్ ఫీల్ తో బయటికి వెళ్తారని ఖచ్చితంగా చెప్పగలను”అని తెలిపారు. చిత్ర హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందో అంతే కథ, డ్రామా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, అను ఇమ్మాన్యూల్, అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News