Saturday, December 28, 2024

యూత్ అందరికీ నచ్చే సినిమా

- Advertisement -
- Advertisement -

Urvasivo Rakshasivo Pre Release in Hyderabad

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో జీఏ-2 పిక్చర్స్ ధీరజ్ మొగిలినేని నిర్మించిన తాజా చిత్రం ఉర్వశివో రాక్షసివో. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ ఎం సహ నిర్మాతగా వ్యవహరించారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకలో దర్శకులు సాయి రాజేష్, చందు మొండేటి, వశిష్ట, వెంకటేష్ మహా, పరుశురామ్, మారుతి, నిర్మాతలు జెమిని కిరణ్, యస్.కె.యన్ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం అల్లు అరవింద్ అందించిన ‘ఊర్వశివో రాక్షసివో‘ బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ “ఈ సినిమాలో అల్లు శిరీష్, అనులు సినిమాకు తగ్గట్టు చాలా బాగా నటించారు. దర్శకుడు సినిమా తీసిన విధానం బాగుంది. హీరో హీరోయిన్ల నుండి అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు.

ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కొత్తగా, అందంగా, కలర్‌ఫుల్‌గా, రొమాంటిక్‌గా కనిపిస్తుంది”అని అన్నారు. చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ “ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. యూత్ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది”అని తెలిపారు. చిత్ర దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ “ఈ సినిమాలో రీల్ లైఫ్ క్యారెక్టర్‌కు రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు చాలా తేడా ఉంటుంది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్‌లు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు”అని పేర్కొన్నారు. చిత్ర హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ “మా నాన్నతో కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు రెండు సినిమాలు చేశాను. అవి రెండు హిట్ అయ్యాయి. ముచ్చటగా మూడో సారి చేస్తున్న ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, అను ఇమ్మాన్యూల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Urvasivo Rakshasivo Pre Release in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News