Saturday, January 4, 2025

ఉర్విల్ నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

టి20లో భారత యువ క్రికెటర్ ఉర్విల్ పటేల్ నయా చరిత్ర సృష్టించాడు. గుజరాత్‌కు చెందిన ఉర్విల్ పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్‌లో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లోనే సెంచరీ సాధించి కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిషబ్ పంత్ పేరిట టి20 ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో రిషబ్ పంత్ 32 బంతుల్లో సెంచరీ సాధించాడు. టి20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీగా ఉండేది.

తాజాగా బుధవారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ దీన్ని బద్దలు కొట్టాడు. ఉర్విల్ ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 10.2 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ 35 బంతుల్లోనే 12 భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో అజేయంగా 113 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News