Monday, January 6, 2025

టీ20 క్రికెట్‌లో ఉర్విల్ ప్రపంచ రికార్డు..

- Advertisement -
- Advertisement -

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో గుజరాత్ యువ ఓపెనర్ ఉర్విల్ పటేల్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో అన్‌సోల్డ్‌ గా మిగిలిన ఉర్విల్ కేవలం 40 బంతుల్లోపే రెండు సార్లు శతకాలు సాధించాడు. నవంబర్ 27న త్రిపురపై 28 బంతుల్లోనే శతకం బాదేసిన ఈ గుజరాత్ ఓపెనర్.. తాజాగా ఉత్తరాఖండ్‌పై 36 బంతుల్లో సెంచరీతో విజృంభించాడు.

ఈ క్రమంలోనే టీ20 క్రికెట్‌లో 40 బంతులలోపే రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దీంతో ఉర్విల్ పై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, రూ.30 లక్షల కనీస ధరతో ఐపీఎల్ మెగా వేలంలో నిలిచి ఉర్విల్ ను ఏ ప్రాంఛైజీ కొనేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతను అన్‌సోల్డ్ గా మిగిలిపోయాడు.. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రమే తన సత్తా చాటుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News