Sunday, December 22, 2024

ఇండియా ఓకే అంటే మణిపూర్‌పై జోక్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇప్పటి పరిస్థితిపై భారత్ కోరుకుంటే తాము సాయం చేస్తామని ఇక్కడి అమెరికా రాయబారి ఎరిక్ గర్సెటీ తెలిపారు.కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా దౌత్యవేత్త వ్యాఖ్యలు తీవ్రస్థాయి దుమారానికి దారితీశాయి. మణిపూర్ పరిస్థితిపై తాను మానవీయ కోణంలో మాట్లాడాల్సి వస్తోంది. మణిపూర్‌లో పరిస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఎక్కువ కాలం ఈ విధంగా ఉంటే ఇది తమకు ఆందోళన కల్గించే విషయం అవుతుందన్నారు. అక్కడ శాంతినెలకొంటే పెట్టుబడులు వస్తాయి. లేకపోతే పరిస్థితి దిగజారుతుందని తెలిపారు. ఇప్పటి మణిపూర్ పరిస్థితి తమకు (అమెరికాకు) ఆందోళన కల్గించివేస్తోందన్న ఈ రాయబారి తాను కేవలం శాంతిభద్రతలు తదనంతర దౌత్య సంబంధాల కోణంలోనే మణిపూర్ విషయంపై మాట్లాడుతున్నానని తెలిపారు.

పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం కోరితే సహకరించేందుకు తాము సిద్ధమని అమెరికా ఈ దిశలో ఎప్పుడూ ముందుంటుందని ప్రకటించారు. శాంతి ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా విజయవంతం కావాల్సి ఉందన్నారు.ఈ ప్రాంతంలో అయినా మరిన్ని ప్రాజెక్టులు, పెట్బుడులు , మరింత సహకారం అనేది సరైన వాతావరణంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తాను ఒక్కటే సందేశం వెలువరించదల్చుకున్నానని, తూర్పు లేదా ఈశాన్య భారతం పరిస్థితి తమకు (అమెరికాకు) చాలా కీలకం అని. అక్కడి ప్రజలు, అక్కడి వనరులు, ఈ ప్రాంతాల భవిష్యత్తు తమ ఆలోచనా పరిధిలో ఉంటాయన్నారు. భారతదేశంలో అంతర్గత మణిపూర్ పరిస్థితిపై ఈ విధంగా అమెరికా రాయబారి వ్యాఖ్యలకు దిగడం క్రమేపీ వివాదాస్పదం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News