Thursday, January 23, 2025

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌తో అమెరికా రాయబారి భేటీ

- Advertisement -
- Advertisement -

ముంబై : భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి మంగళవారం బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌తో ముంబై లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సబర్బన్ బంద్రాలో షారూఖ్ నివాసం మన్నట్‌లో ఉభయులూ హాలీవుడ్, బాలీవుడ్ సాంస్కృతిక ప్రభావం గురించి చర్చించుకున్నారు. సముద్రతీరం వద్ద ఉన్న ఈ బంగళాలో వీరి సమావేశం తాలూకు ఫోటోలను గర్సెట్టి తన ట్విట్టర్ ద్వారా ప్రసారం చేశారు.

ముంబై లోని సినీ పరిశ్రమ గురించి, హాలీవుడ్, బాలీవుడ్ సాంస్కృతిక ప్రభావం గురించి షారూఖ్ నుంచి తానెంతో తెలుసుకున్నానని ఎరిక్ గర్సెట్టి తన ట్విట్టర్ లో వెల్లడించారు.52 ఏళ్ల గర్సెట్టి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు. భారత్‌కు అమెరికా రాయబారిగా గత మార్చిలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముంబై లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీని కలుసుకున్నారు.

నీతా ముఖేశ్ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఎసిసి)ని సందర్శించారు. ది గ్రాండ్ థియేటర్‌లో ఏర్పాటైన భారతీయ సంప్రదాయ వస్త్రప్రదర్శనను ఆయన సందర్శించి ఎంతో అనుభూతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News