- Advertisement -
న్యూయార్క్ : అణ్వాయుధాలు, క్షిపణులను నిషేధించాలని అమెరికాతోపాటు ఐదు మిత్రదేశాలు ఉత్తర కొరియాకు విజ్ఞప్తి చేశాయి. ఉత్తరకొరియా సాగిస్తున్న అస్థిర, చట్టవ్యతిరేక చర్యలను వ్యతిరేకించాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి పిలుపునిచ్చాయి. జనవరి 5 న ఉత్తరకొరియా హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించడం, దాన్ని మామూలు క్షిపణి ప్రయోగంగా ఉత్తర కొరియా పేర్కొనడాన్ని ఉద్దేశిస్తూ భద్రతా మండలితో చర్చలకు ముందుగా మొత్తం ఆరు దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటన చేశాయి. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను అన్నిదేశాలూ అమలు చేయాలని కోరాయి.
- Advertisement -