Monday, December 23, 2024

అమెరికాలో ఐదేళ్ల ఇఎడి కార్డులు..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఐదేళ్లు కాలపరిమితితో ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డులు (ఇఎడి) కల్పించాలని అమెరికా నిర్ణయించింది. గ్రీన్‌కార్డుల కోసం నిరీక్షిస్తున్న వారు ఇతర నాన్ ఇమిగ్రేంట్ కేటగిరిలకు చెందిన వారికి ఈ ఐదేళ్ల కార్డు అందుబాటులోకి వస్తే అమెరికాలో ఇతరత్రా వీసా పర్మిట్లతో ఉన్న లక్షలాది మంది భారతీయ యువతకు ప్రయోజనం చేకూరుతుంది. ఇక్కడి పౌరులు కాని వారికి గరిష్టంగా ఐదేళ్లు చెల్లుబాటులో ఉండేలా దీని పరిమితిని పెంచుతున్నట్లు యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) తమ తాజా ప్రకటనలో తెలిపింది. తొలిసారి ఈ కార్డులు పొందేవారికి, వీటిని పునరుద్ధరించుకునే వారికి కూడా ఈ ఐదు సంవత్సరాల గడువు కల్పిస్తారు. అమెరికాలో ఉద్యోగాలలో చేరేందుకు తప్పనిసరిగా ఈ కార్డులకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఐదేళ్ల కాల పరిమితి పెంపుదల నిర్ణయంతో ఉద్యోగ అధీకృత దరఖాస్తుల సంఖ్యను తగ్గించేందుకు వీలేర్పడుతుంది. ప్రాసిసింగ్ సమయంలో, బ్యాక్‌లాగ్‌లు తగ్గుతాయని ఇమిగ్రేషన్ విభాగం ఆశిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News