Wednesday, January 8, 2025

చికన్‌గున్యాకు తొట్టతొలి టీకా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : దోమలతో వ్యాపించే చికన్ గున్యా టీకాకు అమెరికా ఆరోగ్య శాఖ గురువారం అధికారిక అనుమతిని వెలువరించింది. చికున్ గున్యా ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయి ఆరోగ్య ప్రమాదకర స్థితిని తెచ్చిపెడుతుందని అమెరికా ఆరోగ్యశాఖ హెచ్చరికలు వెలువరించింది. ఈ క్రమంలో అక్కడి అధికారిక ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ (ఎఫ్‌డిఎ! ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాధి నివారణకు తీసుకువచ్చిన వ్యాక్సిన్‌కు వాడకపు అనుమతిని ఇచ్చినట్లు తెలిపింది. ఐరోపా కంపెనీ వాల్నెవా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌కు ఇక్స్‌చిక్ అని పేరు పెట్టారు.  ప్రజలకు ప్రత్యేకించి బాలలకు తీవ్రస్థాయిలో కీళ్లనొప్పుడు, ఒళ్లు నొప్పి కల్గించే చికున్ గన్వాకు ఇప్పటివరకూ సరైన చికిత్స లేదు. ఈ తరుణంలో ప్రపంచస్థాయిలో ఈ టీకానే తొలి చికున్ గున్యా నివారక టీకా అయింది.

ఎఫ్‌డిఎ అనుమతులతో ఈ టీకా ఇక ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అయ్యేందుకు వీలేర్పడుతుంది. కాగా 18 సంవత్సరాలు పై బడ్డ వారికి ఈ టీకా సింగిల్ షాట్ వ్యాక్సిన్‌గా పనిచేస్తుంది. చికున్ గున్యా దోమల ద్వారా వెలువడే వైరస్. దీనితో తేమశాతం ఎక్కువగా ఉండే దేశాలలో ఇది ఎక్కువగా సోకుతోంది. ఇది సోకిన వారికి ఎక్కువ కాలం అనారోగ్యం ఏర్పడుతుంది. ప్రత్యేకించి ఇమ్యూనిటి సరిగ్గా లేని వారికి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఇది ఎక్కువగా వస్తోంది. చిరకాలంగా మనుగడలో ఉంటూ వీడని రీతిలో వ్యాధిని సంక్రమింపచేస్తోన్న ఈ మందుల్లేని వ్యాధికి ఈ టీకా సరైన ఆశారేఖ అవుతుందని సైంటిస్టులు తెలిపారు. అయితే అమెరికాలో ప్రయోగాత్మకంగా దీనిని తీసుకున్న వారిలో కొందరికి దీనితో సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News