వాషింగ్టన్: భారత్‌కు 242 కోట్ల డాలర్లు ఖరీదు చేసే 6 పి-81 గస్తీ విమానాలను విక్రయించేందుకు బైడెన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికన్ పార్లమెంట్‌కు శుక్రవారం తెలియచేసింది. భారతీయ నౌకాదళం 2009 జనవరిలో 8 పి-81 గస్తీ విమానాలను అమెరికా నుంచి నేరుగా కొనుగోలు చేసింది. మరో నాలుగు విమానాలు కొనుగోలు చేసేందుకు 2016 జులైలో సంసిద్ధత తెలిపింది. 2013లో మొదటగా పి-81 విమానాలు భారత నౌకాదళానికి అందాయి. ఇప్పుడు కొనుగోలు చేయనున్న ఆరు పి-81 తీర గస్తీ విమానాలు భారతీయ నౌకాదళ అవసరాలను మరో 30 ఏళ్ల పాటు తీరుస్తాయని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాలకు తోడ్పడడేగాక ఇండో-పసిఫిక్, దక్షిఇణాసియా ప్రాంతంలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక ప్రగతికి ఇది దోహదపడుతుందని పేర్కొంది.
US Approves proposed of 6 P-81 patrol aircraft to India